ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనాలు కొనసాగుతునే ఉన్నాయి. స్వామి, అమ్మవార్లకు గ్రహణకాల అభిషేకాలు చేశారు. రాహు,కేతు పూజలను నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయం లోపల ఊరేగించారు.
గ్రహణాలకు అతీతం.. శ్రీకాళహస్తీశ్వరాలయం - శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్యాత్మిక వార్తలు
సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం దర్శనాలు కొనసాగుతునే ఉంటాయి. ప్రస్తుతం భక్తులంతా కొవిడ్ నియమాలను, భౌతికదూరాన్ని పాటిస్తూ... ఆది దంపతులను దర్శించుకుంటున్నారు.
గ్రహణాలకు అతీతమైన దేవాలయం... శ్రీకాళహస్తీశ్వరాలయం
ఆలయ దర్శనానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ... ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. సూర్యగ్రహణంతో దేశంలోని ఆలయాలన్నీ మూతపడినా.. గ్రహణ గండాలకు అతీతమైన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని మాత్రం.. ఎప్పటిమాదిరే తెరిచి ఉంచారు.
ఇదీ చూడండి :ద్వార బంధనంలో భద్రాద్రి రామయ్య సన్నిధి