తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. కంటోన్మెంట్ పారిశుద్ధ్య సిబ్బంది యాంటీవైరస్ సంబంధించిన స్ప్రే పిచికారీ చేశారు.
కరోనా ఎఫెక్ట్: భయాందోళనలో మహేంద్రహిల్స్ ప్రజలు - భయాందోళనలో మహేంద్రహిల్స్ ప్రజలు
చైనాలో మొదలైన కరోనా ఇప్పుడు మన దేశంలోనూ అడుగుమోపింది. రోజురోజుకి ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తోంది. తెలుగురాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు దావానలంలా వ్యాపించడం వల్ల రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.
కరోనా ఎఫెక్ట్: భయాందోళనలో మహేంద్రహిల్స్ ప్రజలు
ప్రజలలో వ్యాధి పట్ల అవగాహన తీసుకురావటం కోసం కరపత్రాలను, గోడ పత్రికలను ప్రచురించి ప్రచారం చేయనున్నట్లు పారిశుద్ధ్య విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. తమ కాలనీ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తమకు ఈరోజు ఉదయాన్నే తెలిసిందని స్థానికులు వెల్లడించారు.
ఇవీ చూడండి:3 వేలు దాటిన కరోనా మరణాలు- మరిన్ని దేశాలకు విస్తరణ