తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​ వద్ద జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 500కు పైగా క్రీడాకారులు రావడం గర్వంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

Sports Minister srinivas goud Inaugurate national Rowing Championship at hussainsagar
జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ప్రారంభించిన మంత్రి

By

Published : Dec 4, 2019, 11:12 AM IST

ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల విషయంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్సేన్​సాగర్​ వద్ద జాతీయ 38వ రోయింగ్ ఛాంపియన్​షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. గత రోయింగ్ పోటీల్లో పాల్గొన్న విజేతలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ పోటీలు సంజీవయ్య పార్క్ నుంచి బోట్స్ క్లబ్ వరకు జరగనున్నాయి. వీక్షకులకు అనువుగా అత్యుత్తమ అనుభూతి కలిగించేందుకు ఫినిష్ లైన్ వద్ద గ్రాండ్ స్టాండ్​ను నిర్మించారు.

భారతదేశంలో మూడో అతి పెద్ద పోటీలుగా నిలుస్తున్నందుకు, వివిధ రాష్ట్రాలకు చెందిన 500కు పైగా క్రీడాకారులు రావడం గర్వంగా ఉందన్నారు. యువత సినీ రంగం వైపు కాకుండా భవిష్యత్తులో క్రీడా రంగానికి వచ్చే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

జాతీయ రోయింగ్​ ఛాంపియన్​షిప్​ పోటీలను ప్రారంభించిన మంత్రి

ఇవీ చూడండి: టీఎస్‌ఐపాస్​కు ఐదేళ్లు... నేడు ఉత్సవాలు...

ABOUT THE AUTHOR

...view details