రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే జరిగింది. ఓయూ ఆంధ్ర మహిళా సభ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
'క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు' - ఉస్మానియా యూనివర్సిటీ
ఓయూ ఆంధ్ర మహిళా సభ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం నిర్వహించిన స్పోర్ట్స్ డేలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారన్నారు.
'క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు'
వివిధ క్రీడా విభాగాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళలు క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని వెంకటేశ్వర రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో క్రీడాకారులు పాల్గొనేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇవీ చూడండి: 'కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'