తెలంగాణ

telangana

ETV Bharat / state

వీర్యకణాల సంఖ్య తగ్గడానికి 5 కారణాలు - sperm count

వీర్య కణాల తగ్గుదలకు 5 ప్రధాన కారణాలు వివిధ అధ్యయనాల ద్వారా తెలిసింది. అవి

ల్యాప్ టాప్, కాఫీ

By

Published : Feb 5, 2019, 7:13 PM IST

రోజూ మోతాదుకు మించి కాఫీ తాగుతున్నారా.. ల్యాప్​టాప్​పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా.. ధూమపానం, మద్యపానం అలవాటు ఉందా.. అయితే ఈ సమాచారం మీకోసమే.. వీటివల్ల పురుషుల్లో వీర్యకణాల నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
ఓ సర్వే అధ్యయనం ప్రకారం సంతాన లోపంతో బాధపడుతున్న 2 కోట్ల 75 లక్షల మంది దంపతుల్లో ౩౦ నుంచి 40 శాతం పురుషులే ఉన్నారు.
మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం, ల్యాప్​టాప్ వాడటం, ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్ల వల్ల వారి వీర్యకణాల నాణ్యత, సంఖ్య తగ్గిపోతోందని వేర్వేరు అధ్యయనాల్లో తేలింది.

కాఫీ
రోజుకు ౩ కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల ఇన్​విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా తండ్రి అయ్యే శాతం 20 శాతమే.. రోజుకు ఒక కప్పు తాగడం ద్వారా ఈ శాతాన్ని 50కి పెంచుకోవచ్చు.
ఆల్కహాల్
దీని ప్రభావం కచ్చితంగా తెలియకపోయినా ఎక్కువ ఆల్కహాల్ సేవించడం ద్వారా వీర్యకణాల నాణ్యతతో పాటు సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది.
శీతల పానీయం
తరచూ తాగడం వల్ల పురుషుల్లో సంతాన శాతం 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

వయసు
మీ వయసును బట్టి కూడా వీర్యకణాల సంఖ్య ఉంటుంది. ౩౦ ఏళ్ల తర్వాత 1 శాతం టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతాయి. 40 ఏళ్ల తర్వాత వీర్యకణాల ఉత్పత్తిలో జన్యుసంబంధ లోపాలు తలెత్తుతాయి.
ల్యాప్​టాప్ వాడకం
దీనికి విషయానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ల్యాప్​టాప్ వాడకం ద్వారా వీర్యకణాల చలనం, డీఎన్​ఏలో లోపం తలెత్తుతుంది. ఎక్కువగా వాడకం వల్ల నాణ్యత కూడా తగ్గే ప్రమాదం ఉంది.
సిగరెట్
సిగరెట్ తాగడం వల్ల వీర్యకణాల సంఖ్య 23 శాతం, చలనం 13 శాతం తగ్గుతుంది. వీలైనంత వరకు సిగరెట్ తాగడం మానేయడం మంచిది. అది మీతో పాటు పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యకరం.
చిప్స్
మీకు చిప్స్ తినడం ఇష్టమా.. అయితే మీరు ఆ ఇష్టాన్ని తగ్గించుకోవడం మంచిది. ట్రాన్స్ ఫ్యాట్​తో కూడిన జంక్ ఫుడ్, చిప్స్ తినడం వల్ల వీర్యం గాఢత తగ్గుతుంది.
వయసు ప్రభావం వల్ల కేవలం మహిళల్లోనే సంతాన సమస్యలు వస్తాయవుకోవడం పొరపాటు. పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది. ౩౦ ఏళ్ల తర్వాత పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గటమే కాక పడిపోతుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రకారం ౩ దశాబ్దాల క్రితం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య మిల్లీ లీటరుకు 60 మిలియన్స్ ఉండగా ప్రస్తుతం 20 మిలియన్స్ ఉంది.


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details