తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు కొండ వద్ద మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మునిగిపోయిన పడవలను వెలికితీయటంలో నిపుణులైన సత్యం బృందం బయలుదేరింది. భారీ సామగ్రిని దేవీపట్నం పోలీసు స్టేషన్ నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి తరలించారు. బోటు వెలికితీసే సమయంలో ప్రమాద స్థలం వద్దకు ఎవరూ రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధించారు. పెద్ద పెద్ద రోప్‌లు, లంగర్లతో ధర్మాన సత్యం బృందం ప్రమాదం జరిగిన కచ్చులూరు కొండవద్దకు చేరుకుంది.
బోటు వెలికితీత ప్రయత్నాలు ప్రారంభం - తూర్పుగోదావరి
దేవీపట్నం వద్ద ప్రమాదానికి గురైన పడవను బయటకు తీసేందుకు భారీ సామగ్రితో నిపుణులు చేరుకున్నారు.
బోటు వెలికితీత ప్రయత్నాలు ప్రారంభం