కొవిడ్ బారినపడినవారిలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొంది. వ్యాధి లక్షణాలు బయటపడ్డవారిలో దాదాపు అందరిలోనూ.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్లో ఏదో ఒకటి ఉంటోందని తెలిపింది. జనవరి 14 - ఏప్రిల్ 14 మధ్య కొవిడ్ బారినపడ్డ 164 మందిపై అధ్యయనం చేసి, సీడీసీ ఈ మేరకు తేల్చింది.
అత్యధిక కొవిడ్ బాధితులకు ఆ మూడింట్లో ఏదో ఒక సమస్య - కరోనా బాధితుల లక్షణాలు
కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. అయితే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్లో ఏదో ఒక సమస్య కొవిడ్ బాధితుల్లో ఉంటున్నట్లు అమెరికాకు చెందిన సీడీసీ తేల్చింది.
అత్యధిక కొవిడ్ బాధితులకు ఆ మూడింట్లో ఏదో ఒక సమస్య
ఇందులో తేలిన అంశాలివీ..
- 96% బాధితుల్లో జ్వరం లేదా దగ్గు లేదా శ్వాస సమస్యలు తలెత్తాయి. 45% మందిలో ఈ మూడూ కనిపించాయి.
- 84 శాతం మందిలో దగ్గు, 80 శాతం మందికి జ్వరం వచ్చాయి. ఆసుపత్రిపాలైన వారిలో శ్వాస సమస్య కనిపించింది.
- కండరాల నొప్పులు, చలి-వణుకు, అలసట, తలనొప్పి కూడా కొందరిలో కనిపించాయి.
- దాదాపు సగం మందిలో ఉదర సమస్య తలెత్తింది. ఎక్కువ మంది డయేరియాతో ఇబ్బంది పడ్డారు.
- కడుపులో నొప్పి, వాంతులు వంటివి కూడా కొందరిలో కనిపించాయి.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 258 మంది మృతి