తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శానిటైజేషన్​ డ్రైవ్' - తెలుగు వార్తలు

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్​లో ముంపు ప్రభావానికి గురైన 235 కాలనీల్లో చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​ కుమార్ తెలిపారు. ఈనెల 18 నుంచి 28 వరకు నగరంలో 89,134 మెట్రిక్ టన్నుల చెత్తను, వ్యర్థాలను తొలగించామని ఆయన పేర్కొన్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శానిటైజేషన్​ డ్రైవ్​: జీహెచ్​ఎంసీ కమిషనర్​
వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శానిటైజేషన్​ డ్రైవ్​: జీహెచ్​ఎంసీ కమిషనర్​

By

Published : Oct 30, 2020, 8:54 AM IST

హైదరాబాద్​లో వరదల వల్ల ముంపు ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ప్రత్యేక శానిటైజేషన్​ డ్రైవ్​ చేపట్టినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్​కుమార్​ తెలిపారు. ఈనెల 18 నుంచి 28 వరకు ప్రత్యేక డ్రైవ్​ నిర్వహించామని... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు మరో పదిరోజుల పాటు కొనసాగిస్తామన్నారు.

ప్రదానంగా 10 సర్కిళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఆయా సర్కిళ్లవారిగా నియమించిన అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శానిటైజేషన్​ సమస్యలు ఉంటే జీహెచ్​ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ నంబర్​కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మిషన్ మోడ్ పద్ధతిలో చేపట్టిన ఈ కార్యక్రమానికి అదనపు సిబ్బందిని, వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంటు వ్యాధుల నివారణ, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు కాలనీల్లో బ్లీచింగ్, యాంటీలార్వాలతో పాటు... విరివిగా రసాయనాలను పిచికారి చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. యుద్ధప్రతిపదికన చేపట్టిన ఈ డ్రైవ్‌ కోసం ఇప్పటి వరకు ఐదున్నర కోట్లను ఖర్చు చేశామన్నారు.

ఇదీ చూడండి:ఆర్థిక సాయం అందట్లేదని వరద బాధితుల ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details