కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోలుకోవాలంటూ చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో... ఏఐసీసీ కార్యదర్శ సంపత్‌కుమార్ పూజలు చేశారు. కరోనా బారిన నుంచి రాహుల్ క్షేమంగా బయటపడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విపత్కర పరిస్థితులు తొందరగా తొలగి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీకి కరోనా తగ్గాలని ప్రత్యేక పూజలు - rahul gandhi tested corona positvie
కరోనా చిన్నా-పెద్దా, పేద-ధనిక వంటి తారతమ్యాలు ఏమి చూడకుండా అందరిని వణికిస్తోంది. ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొవిడ్ సోకినట్లు వెల్లడించారు. ఆయనకు తొందరగా తగ్గిపోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
రాహుల్ గాంధీకి కరోనా తగ్గాలని ప్రత్యేక పూజలు
దేశంలో కరోనా కోరలు చాస్తున్న తరుణంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంపత్‌కుమార్ కోరారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.
ఇదీ చూడండి:బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్