కరోనా బారినుంచి... ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ రావు సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి గణపతి హోమం, నవగ్రహ ఆరాధన, మృత్యుంజయ హోమం వంటి పూజలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్ర ప్రజలు, కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని పూజలు - తెలంగాణ వార్తలు
తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ రావు సికింద్రాబాద్లోని గణనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని పూజలు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రజలు, కేసీఆర్ కరోనా నుంచి కోలుకోవాలని పూజలు
రెండవ దశ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా బారిన పడిన తెలంగాణ ప్రజలు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలన్న కాంక్షతో హోమాది కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.