తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్

అకాల వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్​లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

By

Published : Nov 7, 2020, 5:20 AM IST

గ్రేటర్​లో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్
గ్రేటర్​లో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్

హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల అనంతరం పేరుకు పోయిన 52 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 960 బృందాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా తొలగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ తెలిపారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, బస్తీ దవాఖానాల పనితీరు, వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.

పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్​తో సమావేశమైన సీఎస్... పురోగతిని తెలుసుకున్నారు. ప్రత్యేక డ్రైవ్​లో భాగంగా వ్యర్థాల తొలగింపుతో పాటు రసాయనాల పిచికారీ సహా ఇతర కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details