ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘనంగా జరిగింది. దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు. ఐదు వందల మీటర్ల నడకను స్పీకర్ జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులకు మానసిక ధైర్యం ఇవ్వడంతో పాటు దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
'దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు' - World Disabled Day
హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 500 మీటర్ల దివ్యాంగుల నడకను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని తెలిపారు.
'వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు'
అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా... దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు వేల 16 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. అంగవైకల్యం మనిషి ప్రతిభకు ఏ మాత్రం అడ్డుకాదని... మనసు ఉంటే మార్గం ఉంటుందని, సాధించాలని పట్టుదల ఉంటే విజయం అసాధ్యం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: చట్టాల 'దిశ' మార్చండి.. కేంద్రాన్ని కోరనున్న సీఎం