హైదరాబాద్ నాంపల్లిలోని రైల్వేస్టేషన్ ఎదుట సౌత్ సెంట్రల్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ యూనిట్స్‌ను కార్పొరేటైజేషన్ చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్.పి.ఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం తిరిగి అమల్లోకి తీసుకురావాలన్నారు. పోస్టులు సరెండర్ చేసి ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు. సిబ్బంది అధికపని భారానికి గురవుతున్నారని , తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని పేర్కొన్నారు. రైల్వే సంస్థలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై రైల్వే ఉద్యోగుల ధర్నా
కేంద్ర ప్రభుత్వ విధానాలపైన సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కేంద్రాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై సౌత్ సెంట్రల్ ఉద్యోగుల ధర్నా