తెలంగాణ

telangana

ETV Bharat / state

special trains: తిరుగుముఖం పట్టిన వారికోసం ప్రత్యేక రైళ్లు

పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీపావళికి సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లి తిరిగి తమ గమ్యానికి చేరేందుకు అనుగుణంగా రైల్వే శాఖ రైళ్లను నడపనుంది.

special trains
special trains

By

Published : Nov 9, 2021, 4:42 AM IST

Updated : Nov 9, 2021, 6:04 AM IST

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (south central railway) శాఖ పలు ప్రత్యేక రైళ్లను (special trains) నడుపుతున్నట్లు తెలిపింది. రేపల్లె-తెనాలి మధ్య, మిర్యాలగూడ-నడికుడి మధ్య మేము, నర్సాపూర్-విజయవాడ మధ్య మేము, కాచిగూడ-రోటేగామ్ మధ్య , కాచిగూడ-మిర్యాలగూడ మధ్య ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నడపనున్నట్లు ద.మ.రైల్వేశాఖ ప్రకటించింది.

వీటితో పాటు బాలియా-సికింద్రాబాద్, దానాపూర్-కే.ఎస్.ఆర్ బెంగళూరు మధ్య 10, 15, 18 తేదీల్లో నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్​-పండాపూర్, పండాపూర్ -హెచ్.ఎస్.నాందేడ్ మధ్య , పండాపూర్-ఆదిలాబాద్ మధ్య 14, 15, 18, 19 తేదీల్లో రైళ్లను (special trains) నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

ఇదీ చూడండి:Covid Death certificate: కొవిడ్‌ మరణ ధ్రువీకరణకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు

Last Updated : Nov 9, 2021, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details