తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ భవన్​లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వేడుకలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు.

By

Published : Dec 9, 2020, 2:17 PM IST

sonia gandhi birthday celebrations at gandhi bhavan in hyderabad
గాంధీ భవన్​లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

హైదరాబాద్​ గాంధీభవన్​లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా వేడుకలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

దేశం కోసం కుటుంబసభ్యుల ప్రాణాలను పణంగా పెట్టిన కుటుంబం గాంధీలదని ఆయన కొనియాడారు. సోనియాగాంధీ వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటన

ABOUT THE AUTHOR

...view details