హైదరాబాద్‌లో కొందరు ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని స్థానిక మహిళలు ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు జగన్, రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ ముఠాగా ఏర్పడి పేదల ఇళ్ల స్థలాలను లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
'కుత్బుల్లాపూర్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు' - హైదరాబాద్ తాజా సమాచారం
రాజధానిలో ప్రజాప్రతినిధులే కబ్జారాయుళ్ల అవతారం ఎత్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భూకబ్జాలకు పాల్పడుతున్నారు. పేదల ఇళ్ల స్థలాలను, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
'కుత్బుల్లాపూర్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు'
రామారాం, జగద్గరిగుట్ట, ఎల్లమ్మబండ ప్రాంతాల్లో బలవంతంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. వారి దౌర్జన్యాలను ప్రశ్నించిన వారిపై రౌడీషీటర్లతో దాడులు చేయిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.