సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై అనాలోచిత విమర్శలు చేసే వారికి వీటి ద్వారా సమాధానం ఇవ్వాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో మంచి నైపుణ్యత గల వారితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సామాజిక మాధ్యమాలే వేదికగా దూసుకెళ్లండి
సామాజిక మాధ్యమాలే వేదికగా దూసుకెళ్లండంటూ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెరాస కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ భవన్లో కార్యకర్తలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన కల్పించారు.
సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన