సీఎం కేసీఆర్ ఆదేశాలతో భాగ్యనగరంలో లాక్డౌన్ను పోలీసులు మరింత కఠినతరం చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్న పోలీసులు... అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని ఎంజే మార్కెట్లో మినహాయింపు సమయం ముగిసినా రద్దీ తగ్గకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
భాగ్యనగరంలో స్వల్ప ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం! - తెలంగాణ వార్తలు
హైదరాబాద్లో లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎంజే మార్కెట్లో రద్దీ నెలకొనడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో పోలీసులతో కొందరు వాహనదారులు వాగ్వాదానికి దిగారు.
హైదరాబాద్లో లాక్డౌన్, భాగ్యనగరంలో లాక్డౌన్
అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి... వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఫలితంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:లాక్డౌన్ ఆంక్షలు కఠినతరం.. ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం