చొరవ:
‘నా పనేదో నేను’.. అనుకుంటూ కొన్ని పరిధుల మధ్యలో పనిచేసే వాళ్లతో పోలిస్తే... చొరవ చూపిస్తూ అవకాశాలు దక్కించుకునేవాళ్లు కెరీర్‌లో చాలా వేగంగా ముందుకు వెళ్లగలుగుతారని కెరీర్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు చొరవతీసుకోవడం, సమస్యలకు తగిన సలహాలు ఇవ్వడం వంటివన్నీ బృందంలో మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలుపుతాయి.
నేర్చుకోవడం ఆపేయొద్దు:
మీ ఆఫీస్ పని మీకు కొట్టిన పిండే. అంతమాత్రాన నేర్చుకోవడం ఆపేయొద్ధు అలా చేస్తే... మీ పనిలో కొత్తదనం కనిపించదు. మీ వ్యక్తిగత అభిరుచులు, లేదా మీ పనికి సంబంధించిన అడ్వాన్స్డ్ నైపుణ్యాల కోసం రోజూ కొంత సమయం కేటాయించండి. అప్పుడు చేసే పనిలో బోర్ ఉండదు. కొత్తదనం కనిపిస్తుంది. మీకు ప్రాధాన్యమూ ఉంటుంది.
ప్రణాళిక ఉందా?:
సాఫీగా సాగిపోతుంది కదాని కెరీర్ పట్ల ప్రణాళిక లేకుండా ఉండకూడదు. వాస్తవ పరిస్థితులు అంచనా వేసుకుంటూ...అవసరమైన మార్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉందంటారు నిపుణులు.
ఇవీ చూడండి:సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..