Six Months Old Baby Missing From Niloufer Hospital :హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి(Niloufer Hospital in Hyderabad) లో ఓ చిన్నారి అదృశ్యం కలకలం రేపింది. ఆరు నెలల చిన్నారి ఫైజల్ ఖాన్ అదృశ్యమైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గురువారం రాత్రి చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తమ ఆరు నెలల బాబు కనిపించకపోవడంతో కంగారు పడిన ఆ తల్లిదండ్రులు ఆస్పత్రి చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సల్మాన్-ఫరీదా దంపతులు.. గండిపేట్ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రం(Agricultural Field)లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులుండగా.. నాలుగేళ్ల వయసున్న పెద్దబాబు అనారోగ్యానికి గురయ్యాడు. తన పెద్ద కుమారుడికి జ్వరం రావడంతో గురువారం ఆసుపత్రికి వచ్చినట్లు చిన్నారి తల్లి ఫరీదా చెప్పారు. తన చిన్న కుమారుడు ఫైజల్ ఖాన్‌తో కలిసి ఆసుపత్రి వార్డు బయట ఉన్నామని తెలిపారు. ఫైజల్ ఖాన్‌ను వార్డులో పడుకోబెట్టి భోజనానికి వెళ్లానని.. 15 నిమిషాల తర్వాత తిరిగొచ్చి చూసేసరికి తన కుమారుడు కనిపించలేదని చెప్పారు.
Baby Missing In Hyderabad Hospital :చిన్నారి అదృశ్యమవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. బంధువుల సాయంతో తల్లిదండ్రులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నారి అదృశ్యమయ్యాడని(Baby Boy Missing From Niloufer Hospital) ఫిర్యాదులో తల్లిదండ్రులు పేర్కొన్నారు. తన కుమారుడి ఆచూకీ త్వరగా కనిపెట్టాలని పోలీస్ స్టేషన్లో తల్లి ఫరీదా రోధించారు. అలాగే ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనతో ఒక మహిళ మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఆమెతో మాట్లాడిన మహిళపైనే తనకు అనుమానం ఉన్నట్లు ఫరీదా పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల(CC Cameras) ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.