vaishali kidnapping case update: మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని వైద్య పరీక్షలు అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వైశాలిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి.. పోలీసులు ముమ్మరంగా గాలిచడంతో ఆమెను స్నేహితుడు సహాయంతో ఇంటికి చేర్చీ తాను మాత్రం కొన్ని రోజులు కర్నూలు, బళ్లారిలో తలదాసుకొని అటనుంచి అటుగా గోవా వెళ్లిపోయాడు. నిన్న రాత్రి హైదరాబాద్ పోలీసులు నవీన్‌రెడ్డిని గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ కేసులో ఇప్పటికి 39 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు.
వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
20:32 December 14
వైశాలి కిడ్నాప్ కేసులో మరో ఆరుగురు అరెస్టు
ఈ కేసులో ఈరోజు సాయంత్రం మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వైశాలి కిడ్నాప్ కేసులో చందు, ప్రవీణ్, ప్రకాష్, మహేశ్, యశ్వంత్ పోలీసులు అరెస్టు చేసి వారిని ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు. వీరందరూ ఈ నెల 9వ తేదీన వైశాలిని కిడ్నాప్ చేసిన నిందితులుగా పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి దాడిలో పాల్గొన్న 32 మంది హస్తినాపురం కేశవపురి కాలనీలోని మిస్టర్ టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశమైనట్లు సమాచారం అందుకుని పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరిలో నాగారం భానుప్రకాశ్ (20), రాథోడ్ సాయినాథ్ (22), గానోజి ప్రసాద్ (25), కోతి హరి (30), బోని విశ్వేశ్వర్‌రావు (26)లను కస్టడీకి ఇవ్వాలని ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మంగళవారం గోవాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: