విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు కూలీలు మృతి - విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి
14:46 November 02
విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు కూలీలు మృతి
ఏపీలోని అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి... నలుగురు కూలీలు మృతి చెందారు. పొలం పనులు పూర్తి చేసుకుని ట్రాక్టర్ ఎక్కుతుండగా... ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అప్పటివరకూ తమతో కలిసి ముందే పనిచేస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో... తోటి రైతు కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చదవండి: