తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేల ఎర కేసు... చిత్రలేఖపై 8 గంటలపాటు సిట్‌ ప్రశ్నల వర్షం.. - సిట్ విచారణ

Sit inquiry on TRS MLAs Buying case ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ఇద్దరిని సిట్‌ విచారించింది. న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌తో పాటు, నందకుమార్ భార్య చిత్రలేఖను అధికారులు ప్రస్నించారు. ఫాంహౌజ్‌లో పట్టుబడిన వారితో ఉన్న సంబంధాలపై ప్రతాప్ గౌడ్‌ను విచారించగా నందకుమార్ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను ప్రశ్నించారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించడంతో ముగ్గురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Etv Bharat
Etv Bharatఎమ్మెల్యేల ఎర కేసు... నిందితులకు రిమాండ్‌ పొడిగింపు...

By

Published : Nov 25, 2022, 8:03 PM IST

ఎమ్మెల్యేల ఎర కేసు... చిత్రలేఖపై 8 గంటలపాటు సిట్‌ ప్రశ్నల వర్షం..

Sit inquiry on TRS MLAs Buying case టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఫాంహౌస్‌లో పట్టుబడిన ముగ్గురు రాంచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ సహా భాజపా జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌, తుషార్‌, జగ్గూస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ని నిందితుల జాబితాలో చేర్చిన సిట్‌...ఆ వ్యవహారంతో సంబంధం ఉన్నవారికి నోటీసులు జారీచేస్తూ.. లోతుగా దర్యాప్తు చేస్తోంది. కేసులో నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌... నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ విచారణకు హాజరయ్యారు. 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. నందు భార్య చిత్రలేఖ, ప్రతాప్‌ సోమవారం మళ్లీ విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వారిని అధికారులు ప్రశ్నించారు. నందకుమార్‌తో న్యాయవాదిప్రతాప్‌గౌడ్ పలులావాదేవీలు నిర్వహించడం సహా ఇద్దరు కలిసి ప్రయాణాలు సాగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నందకుమార్, రామచంద్ర భారతి మొబైల్‌ఫోన్లలో డేటా సేకరించారు. వారితో ప్రతాప్‌గౌడ్‌కున్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. కాగా సిట్ నోటీసులపై ఇప్పటికే ప్రతాప్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా... తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించారు. కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి జరిగినట్లు దర్యాప్తులో తేలగా అధికారులు నోటీసుఇచ్చి ప్రశ్నించారు. సిట్‌ విచారణకు రావాల్సిన న్యాయవాది శ్రీనివాస్‌ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. న్యాయవాది శ్రీనివాస్ ముక్కుకు శస్త్రచికిత్స జరగ్గా కనీసం మూడురోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ విషయాన్ని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల తర్వాత వైద్యుడి సలహా తీసుకొని విచారణకు వచ్చే విషయాన్ని తెలియజేస్తానని పేర్కొన్నారు.

రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజి రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించడంతో ముగ్గురిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని మెయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి గత నెల 28న ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. 11న రిమాండ్ ముగియడంతో పోలీసులు న్యాయస్థానం హాజరుపర్చారు. 25వరకు రిమాండ్ ను విధించింది. ఆ గడువు ముగియడంతో పోలీసులు మరోసారి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ పొడిగించింది.

ఇవీ చూడండి:

నయనతారపై డైరెక్టర్​ విఘ్నేశ్​ తల్లి వైరల్​ కామెంట్స్!

ప్రభాస్​తో పెళ్లి.. ఎట్టకేలకు నిజం ఒప్పేసుకుందిగా కృతిసనన్​!

ABOUT THE AUTHOR

...view details