తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 33 జిల్లాల్లో సీరో సర్వేకు సన్నద్ధం

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రజల్లో ఎంతవరకు యాంటీబాడీలు (ప్రతిరక్షకాలు) వృద్ధి చెందాయో తెలుసుకోవడానికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సీరో సర్వే చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ సైంటిస్టు డాక్టర్‌ ఆవుల లక్ష్మయ్య తెలిపారు. గత ఏడాది హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరో మూడు జిల్లాల్లో ఎన్‌ఐఎన్‌ ఈ సర్వే నిర్వహించింది. రెండో దశ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ముఖాముఖిలో లక్ష్మయ్య మాట్లాడారు.

siro survey
సీరో సర్వే

By

Published : Apr 21, 2021, 7:33 AM IST

గత ఏడాది హైదరాబాద్‌లో 50 శాతం, 3 జిల్లాల్లోని 25 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని సీరో సర్వేలో గుర్తించినప్పుడు,రెండో దశలో కరోనా ఈస్థాయిలో విజృంభించకూడదు కదా?

రాజధానిలో 50 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందడం వల్లే దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అలా లేకుంటే కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో కేసులే కాదు మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాలుండే జిల్లాల్లో 25 శాతమే యాంటీబాడీలు ఉండటం వల్ల రెండో దశలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

మరోసారి సీరో సర్వే నిర్వహించే అవకాశం ఉందా?

రాష్ట్రవ్యాప్తంగా సీరో సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట ఎన్‌ఐఎన్‌కు లేఖ రాసింది. ఇందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ రెండ్రోజుల కిందట ప్రభుత్వానికి సమాధానమిచ్చింది. ప్రభుత్వం ఆదేశిస్తే వచ్చే వారంలోగా ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రతి జిల్లాలో 500 మంది రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ చేస్తాం.

యాంటీబాడీలు వృద్ధి చెందిన వారికి కొవిడ్‌ సోకే అవకాశం లేదా?

యాంటీబాడీలు బాగా ఉన్న వ్యక్తికి కొవిడ్‌ సోకినా తీవ్ర ప్రభావం చూపించదు. మూడు నాలుగు రోజుల్లోనే సాధారణ స్థితికి రావచ్చు. లేనివారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అలా కాకపోయినా వీరు కోలుకోవడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది.

ఇదీ చదవండి:ఆక్సిజన్​ ప్లాంట్​లకు సాయుధ బలగాల రక్షణ

ABOUT THE AUTHOR

...view details