తెలంగాణ

telangana

ETV Bharat / state

'675 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం' - SINGARENI CMD SRIDHAR

రానున్న ఆర్థిక ఏడాదికి 675 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా సింగరేణి ముందుకు సాగుతోంది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల కోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది.

కీలక నిర్ణయాలకు సింగరేణి బోర్డు ఆమోదం
కీలక నిర్ణయాలకు సింగరేణి బోర్డు ఆమోదం

By

Published : Feb 22, 2020, 10:52 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 675 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యం ఖరారు చేసుకుంది. లక్ష్య సాధన కోసం అవసరమైన 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకరించింది. 2020-21 సంవత్సరంలో 675 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి సింగరేణి బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ తొలగింపు పనులను ఆమోదించింది.

కొత్త ప్రణాళికలకూ ఆమోదం...

ఓపెన్ కాస్ట్ గనుల్లో ధూళి నివారణకు వినియోగించే స్ప్రింకర్ ట్యాంకర్లను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. భారీ సామగ్రి తరలించే క్రేన్లను కూడా కొనేందుకు బోర్డు అనుమతించింది. కొత్త మైనింగ్ ప్రణాళికలను బోర్డు ఆమోదించింది. సింగరేణి సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి పీఎస్ఎల్ స్వామి, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా, సింగరేణి డైరెక్టర్లు ఏఎస్ శంకర్, ఎస్.చంద్రశేఖర్, బీ భాస్కర్ రావు, ఎన్ బలరాం హాజరయ్యారు.

కీలక నిర్ణయాలకు సింగరేణి బోర్డు ఆమోదం

ఇవీ చూడండి : సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన రజత్​కుమార్​

ABOUT THE AUTHOR

...view details