ఏపీలోని విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయం ప్రకారం 14వ తేదీన నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కు గానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ 11257208642, IFSC:SBIN0002795 కు పంపచవచ్చని పేర్కొన్నారు.
అర కేజీ చందనం సమర్పణ కోసం రూ. 10,116 , కేజీ చందన సమర్పణ కోసం రూ. 20,116 భక్తులు పై అకౌంట్‌కు పంపించాలన్నారు అధికారులు. విరాళాలు పంపిన అనంతరం.. దానిని స్క్రీన్ షాట్ తీసి చిరునామాను, గోత్ర నామాలను 6303800736 నంబర్‌కు వాట్సప్ మెసేజ్ చేయాలని తెలిపారు. విరాళాలను 13వ తేదీలోగా పంపించాలన్నారు. చందనోత్సవ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించొచ్చని తెలిపారు. సలహాలు, సందేహాలుంటే 6303800736 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్ : భద్రాద్రి ఆలయానికి తగ్గిన భక్తుల తాకిడి