హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణదేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ పూజారులు శాలువా కప్పి, స్వామివారి చిత్రపటాన్ని హరీశ్‌రావుకు అందజేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఉజ్వలసేవలో హరీశ్‌రావు, కేశవరావు పాల్గొని మాధవున్ని సేవించారు. ఆలయం ప్రాంగణమంతా గోవిందనామంతో మారుమోగింది.
గోపాలుడి సేవలో హరీశ్‌రావు... - srikrishnajanmastami
హైదరాబాద్‌లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉజ్వల సేవలో పాల్గొన్నారు.
గోపాలుడి సేవలో హరీశ్‌రావు...