తెలంగాణ

telangana

ETV Bharat / state

టెలికమ్ దిగ్గజం శ్యామ్​ పిట్రొడాకు రాజీవ్​ గాంధీ సద్భావనా అవార్డు - v.hanumanth rao

మాజీ ప్రధాన మంత్రుల సలహాదారు, టెలికమ్యూనికేషన్ రంగ దిగ్గజం శ్యామ్ పిట్రొడాకు రాజీవ్‌ గాంధీ సద్భావనా అవార్డును ప్రధానం చేయనున్నట్లు రాజీవ్‌ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి అధ్యక్షుడు జి.నిరంజన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి అధ్వర్యంలో ఈ నెల 19న చార్మినార్ వద్ద జరిగే రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.

Shyam pitroda got rajiv gandhi memorial Awardd
టెలికమ్ దిగ్గజం శ్యామ్​ పిట్రొడాకు రాజీవ్​ గాంధీ సద్భావనా అవార్డు

By

Published : Oct 17, 2020, 6:47 AM IST

భారత మాజీ ప్రధానుల సలహాదారు, టెలీ కమ్యూనికేషన్​ రంగలో దిగ్గజం అయిన శ్యామ్​ పిట్రొడాకు రాజీవ్​ గాంధీ సద్భావనా అవార్డు అందించనున్నట్టు రాజీవ్​ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి అధ్యక్షుడు జి. నిరంజన్​ తెలిపారు. అక్టోబర్​ 19న చార్మినార్​ వద్ద జరుగనున్న స్మారక సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పిట్రొడాకు ఈ అవార్డు అందించనున్నారు. రాజీవ్​ గాంధీ సలహాదారుగా, దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం టెలీ కమ్యూనికేషన్​ సేవలు అందించడంలో పిట్రొడా ఎంతో శ్రమించారని నిరంజన్​ అన్నారు. భారతదేశ కంప్యూటర్, ఐటీ రంగ పితామహుడిగా ఆయనకు గుర్తింపు ఉందని తెలిపారు.

స్వర్గీయ రాజీవ్ గాంధీ 1990 అక్టోబరు 19వ తేదీన చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేసి జంట నగరాలలో సద్భావనా యాత్ర జరిపారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని నిరంజన్​ తెలిపారు. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేసిన చోట పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారన్నారు. ముఖ్య అతిధిగా పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్, పీసీసీ మాజీ అధ్యక్షులు వీ.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, శశిధర్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ ఆలీ, అంజన్ కుమార్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరవుతారని ఆయన వివరించారు.

ఇవీచూడండి:ధరణి యాప్​ వల్ల నష్టాలు లేవు... పుకార్లు నమ్మొద్దు: సీఎస్

ABOUT THE AUTHOR

...view details