తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ నవమి శోభాయాత్ర - Shri Ram Navami 2023

Shri Ram Navami Shobhayatra in Hyderabad శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి కోఠి వరకు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలిచవచ్చి స్వామివారిని దర్శించకున్నారు. దారిపొడవునా జైశ్రీరామ్ నామస్మరణ చేశారు.

Shri Ram Navami Shobhayatra in Hyderabad
హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ నవమి శోభాయాత్ర

By

Published : Mar 30, 2023, 10:35 PM IST

Shri Ram Navami Shobhayatra in Hyderabad శ్రీరామ నవమి సందర్భంగా భాగ్యనగరంలో రాముడి శోభా యాత్ర వైభవంగా ముగిసింది. మంగ‌ళ్‌హాట్‌ స‌మీపంలోని సీతారాంబాగ్ ఆల‌యం నుంచి సాగిన ఈ యాత్ర... 7 కిలోమీటర్ల దూరంలోని కోఠిలోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంది. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ శోభా యాత్ర కొనసాగింది. ఇక ఈ శ్రీరామ శోభా యాత్రలో భారీగా భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా పాల్గొన్నారు.

ఓల్డ్‌ సిటీలోని సీతారాంబాగ్‌ రామాలయంలో స్వామివారి కల్యాణం పూర్తి అయ్యాక... ఆ తర్వాత శ్రీరాముని శోభాయాత్రను ప్రారంభమైంది. ఈ శోభా యాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. దూల్ పేట్ సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయత్ర బోయగూడ కమాన్, మంగళ్ హాట్, జాలి హనుమాన్, దూల్ పేట, పురానా పూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగం బజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా కోఠి సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగిసింది.

ఇక భాగ్యనగరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శోభా యాత్ర సజావుగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం దాదాపు 1,500 మంది పోలీసులను శోభా యాత్రను పర్యవేక్షించారు. శ్రీరామ నవమి శోభా యాత్ర ఊరేగింపు గురువారం ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభం అయింది. ఇక రాత్రి కోఠిలోని హనుమాన్ వ్యామశాల మైదానంలో ముగిసింది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ పోలీసు అధికారులు ఊరేగింపును పర్యవేక్షించారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రాముడి ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిఘా, డ్రోన్ కెమెరాల సహాయంతో ఊరేగింపును పోలీసులు పర్యవేక్షించారు. శోభా యాత్ర సందర్భంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు. వాహనదారులు, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్‌ను కూడా బంద్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details