తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస విధానాలు దేశానికే ఆదర్శం' - లోక్​సభ ఎన్నికల్లో

తెరాస అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి తలసాని సూచించారు. తెరాస విధానాలు దేశానికి ఆదర్శంగా మారాయని అన్నారు.

నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు తలసాని పిలుపు

By

Published : Jul 13, 2019, 9:39 PM IST

తెరాస సభ్యత్వ నమోదులో ముషీరాబాద్ నియోజకవర్గం అగ్రభాగాన నిలవాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లక్ష్య సాధనకు కార్యకర్తలు, నాయకులు నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్​లోని వైశ్య విద్యార్థి వసతి గృహంలో పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇటీవలే జరిగిన లోక్​సభ ఎన్నికల్లో భాజపా కేవలం నాలుగు సీట్లే గెలిచి ప్రగల్భాలు పలుకుతోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనసభ్యుడు ముఠా గోపాల్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్​లో తెరాస సభ్యత్వ నమోదు

ABOUT THE AUTHOR

...view details