తెలంగాణ

telangana

ETV Bharat / state

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అతివలు - అమీర్​పేట్​

హైదరాబాద్​ అమీర్​పేట్​లోని ఓ హోటల్లో సూత్ర ఫ్యాషన్​షో లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈమేరకు నగర మోడల్స్ సంప్రదాయ దుస్తులతో హొయలొలికించారు. హంసనడకలతో ర్యాంపుపై నడుస్తూ సందడి చేశారు.

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అతివలు

By

Published : Sep 24, 2019, 11:28 AM IST

సంప్రదాయ దుస్తులతో అతివలు మెరిసిపోయారు. పలువురు డిజైనర్లు రూపొందించిన సరికొత్త వస్త్రాలతో ర్యాంప్​పై హంసనడకలతో హొయలొలికించారు. హైదరాబాద్​లో సూత్రా ఫ్యాషన్ అండ్​ లైఫ్​స్టైల్ ఆధ్వర్యంలో ఈనెల 28నుంచి 29 బంజారాహిల్స్​లో ప్రదర్శన కార్యక్రమం జరగనుంది. ఈమేరకు అమీర్​పేట్​లోని మ్యారీ గోల్డ్​ హోటల్లో నిర్వాహకులు లోగోను ఆవిష్కరించారు. 80మంది ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ట్రెండీ దుస్తులు కొలువుదీరనున్నట్లు వారు తెలిపారు. ​

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అతివలు

ABOUT THE AUTHOR

...view details