తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్ స్టేషన్​లో శిఖా చౌదరి - విచారణ నిమిత్తం హాజరైన శిఖాచౌదరి

జయరాం హత్యకేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిన్న ప్రధాన నిందితులతో పాటు 10 మంది విచారించగా, నేడు రాకేశ్​ రెడ్డి ఇంటిని పరిశీలించారు. విచారణ నిమిత్తం జయరాం మేనకోడలు శిఖా చౌదరి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్​లో హాజరయ్యారు.

విచారణ నిమిత్తం హాజరైన శిఖాచౌదరి

By

Published : Feb 14, 2019, 4:11 PM IST

విచారణ నిమిత్తం హాజరైన శిఖాచౌదరి
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో విచారణ రెండోరోజు కొనసాగుతోంది. నిన్న రాకేశ్​ రెడ్డి, శ్రీనివాస్​తో పాటు 10 మందిని విచారించిన పోలీసులు నేడు రాకేశ్​రెడ్డి ఇంటిని పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్​ నెం-10లోని నివాసాన్ని డీసీపీ, ఏసీపీ ఆధ్వర్యంలో ఘటనా స్థలంలో హత్య సీన్​ను రీ కనస్ట్రక్షన్ చేశారు. మరోవైపు జయరాం మేనకోడలు శిఖా చౌదరి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్​లో డీసీపీ ముందు హాజరయ్యారు. హత్యకేసులో ఆమె ప్రమేయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details