తెలంగాణ

telangana

ETV Bharat / state

కిషన్​ రెడ్డిని బెదిరించిన షేక్​ ఇస్మాయిల్​ రిమాండ్​ - threatening

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఫోన్ లో బెదిరించిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు కడపలో అరెస్ట్ చేసి హైదరాబాద్​కు తీసుకొచ్చారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచి...రిమాండ్​కు తరలించారు.

Kishan Reddy

By

Published : Jul 24, 2019, 1:20 PM IST

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఫోన్​లో బెదిరించిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు . కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు కిషన్ రెడ్డికి మే 24న గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది. దూషిస్తూ ,అంతు చూస్తానంటూ ఫోన్​లో బెదిరించాడు . జూన్ 12న కిషన్ రెడ్డి ప్రతినిధులు సీసీఎస్ లో ఫిర్యాదు చేయగా , పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు . కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ ఫోన్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అతడు రెండేళ్ల క్రితం దుబాయ్​కి వెళ్లి , అక్కడ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో కిషన్ రెడ్డి ప్రసంగం విని ద్వేషం పెంచుకుని... కువైట్ నుంచే ఫోన్ చేసి బెదిరించాడు. కొద్ది రోజుల క్రితం కడపకు వచ్చాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇస్మాయిల్​ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

కిషన్​ రెడ్డిని ఫోన్​లో బెదిరించిన షేక్​ ఇస్మాయిల్​ రిమాండ్​

ABOUT THE AUTHOR

...view details