తెలంగాణ

telangana

ETV Bharat / state

షీ బృందాల పనితీరు భేష్​: స్వాతి లక్రా - she team puts full efforts for women safety

మహిళలు, యువతులను వేధించే ఆకతాయిల పట్ల షీ టీం​ పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ప్రత్యక్ష్యంగానే కాకుండా ఆన్​లైన్​ ద్వారా కూడా పోకీరీ గాళ్లకు కౌన్సిలింగ్​ ఇస్తూ వేధింపులకు పాల్పడితే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో తెలియజేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ మేరకు షీ టీం​ పోలీసుల పనితీరుతో ఫిర్యాదుదారుల్లో 96శాతం సంతృప్తిగా ఉన్నారని ఏడీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.

she team puts full efforts on women safety wing
ఆన్​లైన్​ ద్వారా ఆకతాయిల ఆట కట్టిస్తోన్న షీ టీం..

By

Published : Dec 15, 2020, 8:13 AM IST

షీ టీం పోలీసుల పనితీరు పట్ల ఫిర్యాదుదారుల్లో 96శాతం సంతృప్తి వ్యక్తం చేశారని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. దీనిని 100శాతానికి తీసుకెళ్లేలా షీ టీం పోలీసులకు దిశా నిర్దేశం చేసినట్లు ఆమె వెల్లడించారు. మహిళలు, యువతులను వేధించే పోకిరీలకు ప్రత్యక్ష కౌన్సిలింగ్​ విధానం ద్వారానే కాకుండా మహిళా భద్రతా విభాగం నుంచి ఆన్ లైన్​లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. వేధింపులకు పాల్పడితే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో పోకిరీలకు వివరిస్తున్నారు.

ఈమధ్య కాలంలో ఫోన్​లో, సామాజిక మాధ్యమాల్లో, నేరుగా వేధింపులకు పాల్పడుతున్న 114 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సెప్టెంబర్​లో ప్రవేశపెట్టిన ఈ ఆన్​లైన్ కౌన్సిలింగ్ విధానం ద్వారా 470 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఐజీ సుమతి తెలిపారు. 17 జిల్లాల నుంచి షీటీం పోలీసులు ఆన్​లైన్ ద్వారా పోకిరీలకు కౌన్సిలింగ్ ఇప్పించారని పేర్కొన్నారు. ఆకతాయిల ఆటకట్టించడంలో హైదరాబాద్ షీటీం పోలీసులు ముందు వరుసలో ఉన్నారని.. గ్రామాల్లోని మహిళలకు షీ టీం పట్ల అవగాహన కల్పిస్తున్నామని డీఐజీ చెప్పారు.

ఇదీ చదవండి:మహిళలకు మరుగుదొడ్లు, శిశువులకు పాలిచ్చే కేంద్రాలు

ABOUT THE AUTHOR

...view details