తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయ నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్​జీ పల్లోంజీ సంస్థ - Telangana Secretariat complex

సచివాలయ సముదాయ నిర్మాణ టెండరును షాపూర్​జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. రూ.494 కోట్లకు టెండర్ పిలువగా 4 శాతం ఎక్కువగా రూ.514 కోట్లు కోట్‌ చేసి టెండర్‌ ప్రక్రియలో ఎల్-1 గా నిలిచింది. ఈ మేరకు షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు ఆర్‌ అండ్‌ బీ శాఖ అంగీకార పత్రం ఇచ్చింది. అయితే 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని టెండర్‌లో ప్రభుత్వ షరతు విధించింది.

Shapoorji Pallonji wins contract for Telangana Secretariat complex
సచివాలయ పనులు షాపూర్​జీ పల్లోంజీకే..

By

Published : Oct 29, 2020, 5:09 AM IST

Updated : Oct 29, 2020, 6:47 PM IST

సచివాలయ భవన సముదాయ నిర్మాణ పనులను షాపూర్​జీ పల్లోంజీ సంస్థ దక్కించుకొంది. టెండర్ ప్రక్రియలో సంస్థ ఎల్-1గా నిలిచింది. భవన సముదాయ నిర్మాణం కోసం రహదార్లు, భవనాల శాఖ రూ.494 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. షాపూర్​జీ పల్లోంజీ సంస్థతో పాటు ఎల్ అండ్ టీ సంస్థలు రేసులో నిలిచాయి. ఆర్థిక బిడ్లను తెరిచాక కమిషనరేట్ ఆఫ్ టెండర్స్​కు బిడ్లను నివేదించారు. రెండు సంస్థల ఆర్థిక బిడ్లను పరిశీలించారు. రూ.494 కోట్లపై షాపూర్​జీ పల్లోంజీ సంస్థ నాలుగు శాతం అధికంగా రూ.514.75 కోట్లకు బిడ్ దాఖలు చేయగా.. ఎల్ అండ్ టీ సంస్థ 4.8శాతం ఎక్కువగా రూ.518.61 కోట్లకు బిడ్​ దాఖలు చేసింది. తక్కువ కోట్ చేసిన పల్లోంజీ సంస్థకు టెండర్ దక్కింది. ఈ మేరకు అంగీకార పత్రాన్ని సంస్థకు ఆర్ అండ్ బీ శాఖ అందించింది.

సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సుమారు ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవన సముదాయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం ఆదివారాలు, పండగ రోజుల్లో కూడా 24 గంటలూ పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం టెండరులోనే వెసులుబాటు కల్పించింది. నిర్మాణ సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఈ-బిడ్డింగ్​ ద్వారా టెండర్లు ఆహ్వానించగా ఎల్​అండ్​టీ, షాపూర్​జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. రెండు సంస్థలు సాంకేతిక బిడ్స్​లో అర్హత పొందటంతో రహదారులు-భవనాల శాఖ ఆర్థిక బిడ్స్​ను గత వారం తెరిచింది.

ఇవీ చూడండి: నేటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

Last Updated : Oct 29, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details