తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉజ్జయిని మహంకాళికి శాకంబరీ ఉత్సవాలు - తిలకించిన భక్తులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు

By

Published : Jul 12, 2019, 5:34 PM IST

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా శాకంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో అమ్మవారికి పలు రకాల పళ్లు, కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రకరకాల పూలు, పళ్లు, కూరగాయలతో అలంకరించడం వల్ల ఆలయం నూతన శోభ సంతరించుకుంది.
తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. శాకంబరీ అమ్మవారి రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వంలో పరవశించారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు.

తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
ఇవీ చూడండి : చివరి దశకు చేరుకున్న యాదాద్రి నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details