తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగం ఇప్పిస్తానని ఒమన్​లో బానిసను చేశారు - dabirpura police station

హైదరాబాద్​ చంచల్​గూడకు చెందిన ఓ మహిళ కుటుంబ పోషణ కోసం ఒమన్​ వెళ్లి... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఆమె కుమార్తె ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లగా అధికారులు ఆ మహిళను స్వదేశానికి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.

రూ. 2 లక్షలు చెల్లిస్తేనే ఇక్కడి నుంచి కదిలేది : షేక్​

By

Published : Mar 30, 2019, 7:59 AM IST

Updated : Mar 30, 2019, 11:21 AM IST

ఏజెంట్​ మాటలు నమ్మి మోసపోయిన కుల్సుంబేగం
హైదరాబాద్​ పాతబస్తీలోని చంచల్​గూడకు చెందిన కుల్సుంబేగం కుటుంబ పోషణ కోసం ఒమన్​ వెళ్లాలనుకుంది. ఏజెంట్​ మాటలు నమ్మి మోసపోయింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ షేక్​కు రూ. 2లక్షలకు అమ్మేశారు. ఏడాది కాలంగా పనిచేస్తున్నా... షేక్​ మాత్రం ఒక్క రూపాయి చెల్లించకపోగా సరైన భోజనం కూడా పెట్టడం లేదని... తన కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి వాపోయింది.కూతురు ప్రోత్బలంతోనే....
ఆమె కూతురు రుక్సార్​.. డబీర్​పుర పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. స్థానిక నేతల సహకారంతో విదేశాంగ మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రూ. 2 లక్షలు చెల్లించాలని లేకపోతే మరో మహిళను అక్కడికి పంపించాలని షేక్​ మొండికేశాడు. ఒమన్​ రాయబార కార్యాలయ సాయంతో బాధితురాలిని స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నకిలీ ఏజెంట్లతో జాగ్రత్త!
ఆర్థిక ఇబ్బందులున్న మహిళలు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి కష్టాల నుంచి గట్టెక్కాలనుకుంటున్నారు. నకిలీ ఏజెంట్లు రంగంలోకి దిగిసొమ్ము చేసుకుంటున్నారు. ఏజెంట్ల మోసాలతో చాలా మంది మహిళలు షేక్​ల వద్ద పని చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Last Updated : Mar 30, 2019, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details