తెలంగాణ

telangana

ETV Bharat / state

కామాంధుడికి ఏడేళ్ల జైలు శిక్ష - కామాంధుడికి ఏడేళ్ల జైలు శిక్ష

కామంతో కళ్లు ముసుకుపోయి కన్న కూతురిని లైంగింకంగా వేధించిన రాక్షసుడికి నాంపల్లి కోర్టు.. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కేసు దర్యాప్తులో చేసిన బంజారాహిల్స్ ఎస్సై భరత్ భూషణ్​ను సీపీ అంజనీ కుమార్  అభినందించారు.

డేవిడ్

By

Published : Oct 1, 2019, 10:22 PM IST

2017లో బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న డేవిడ్ తాగి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. డేవిడ్ కూతురు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును విచారంచిన నాంపల్లి కోర్టు మంగళవారం నిందితుడికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కేసు దర్యాప్తులో నిందితుడికి శిక్ష పడేలా ఆధారాలు సేకరించిన బంజారాహిల్స్ ఎస్సై భరత్ భూషణ్​ను సీపీ అంజనీ కుమార్ అభినందించారు.

కామాంధుడికి ఏడేళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details