తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి విద్యార్థిపై 8 మంది దాడి - పదో తరగతి విద్యార్థిపై ఒక్కసారిగా 8 మంది దాడి

సికింద్రాబాద్ పరిధిలోని సుభాష్ నగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిపై 8 మంది దుండగులు దాడి చేశారు. బాధితుడిని లోతుకుంటలోని ఆసుపత్రికి తరలించగా మూడు చోట్ల బ్లేడ్​ గాయాలున్నాయని వైద్యులు గుర్తించారు.

విద్యార్థిపై తీవ్రంగా దాడి చేసిన దుండగులు
విద్యార్థిపై తీవ్రంగా దాడి చేసిన దుండగులు

By

Published : Mar 11, 2020, 6:53 AM IST

సికింద్రాబాద్ సుభాష్ నగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థిపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఖానాజి గూడా శివనగర్​లో వంశీ అనే విద్యార్థి ట్యూషన్​కు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. బ్లేడ్​తో బాధితుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగింది. ఒక్కసారిగా ఎనిమిది మంది దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వంశీపై దాడికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

మూడు చోట్ల బ్లేడ్​తో దాడులు !!

గతంలో ఏమైనా గొడవలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీని లోతుకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు.. శరీరంపై మూడు చోట్ల బ్లేడుతో దాడికి పాల్పడ్డ గాయాలను వైద్యులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

విద్యార్థిపై తీవ్రంగా దాడి చేసిన దుండగులు

ఇవీ చూడండి : బాలింత మృతి.. ఆపరేషన్ థియేటర్​లో డాక్టర్లపై దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details