రాష్ట్రంలో మరోమారు పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురు ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చారు. సీఐడీ ఎస్పీగా ఆర్.వెంకటేశ్వర్లు, సైబరాబాద్ పరిపాలనా డీసీపీగా యోగేశ్ గౌతమ్, పీసీఎస్ఎస్ ఎస్పీగా రంగారెడ్డి, ప్రభుత్వ రైల్వే పోలీస్ అడ్మిన్ ఎస్పీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయ విభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్ బదిలీ అయ్యారు.
వీళ్లంతా కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెల క్రితం భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. అయినా కొంతమందికి పోస్టింగులు లేక డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఏడుగురికి ఈ ఉత్తర్వులతో పోస్టింగులు వచ్చాయి. వెయిటింగ్లో మరికొంత మంది ఉన్నారు. వాళ్లకు కూడా పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది.
10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా..: మరోవైపు రాష్ట్ర సర్వీసుకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. రెవెన్యూ కోటాలో ఐదుగురు, నాన్ రెవెన్యూ కేటగిరీలో ఐదుగురికి ఐఏఎస్ హోదా కల్పించారు. జల్ద అరుణ శ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్, కోరం అశోక్ రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్ ఐఏఎస్ హోదా పొందిన వారిలో ఉన్నారు. రాష్ట్ర అధికారులకు జనవరి నెలలో యూపీఎస్సీ దిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వాటి ఫలితాలను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
అరుణశ్రీ, నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్ రెవెన్యూ కేటగిరీ నుంచి ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కేటగిరీలో అశోక్ రెడ్డి, హరిత, వెంకటనర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్‌కు ఐఏఎస్ హోదా లభించింది. సహకారశాఖకు చెందిన అశోక్ రెడ్డి మంత్రి హరీశ్‌రావు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్నారు. సహకార శాఖకు చెందిన వెంకటనర్సింహారెడ్డి టీఎస్ఐఐసీ ఎండీగా విధుల్లో ఉన్నారు. హరిత వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ కాగా.. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన కాత్యాయని మంత్రి కేటీఆర్ వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.