వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సర్వర్లు మొరాయిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్ల బుకింగ్ కోసం యత్నిస్తుండగా సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్ బుకింగ్ కోసం ఉదయం నుంచే ప్రయత్నిస్తున్న వాళ్లకు సర్వర్లు మొరాయిస్తున్నాయి. నేటి నుంచి పాతవిధానంలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు.. స్లాట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించారు.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు - Registration of non-agricultural properties in Telangana
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. సర్వర్లు మొరాయిస్తున్నాయి. నేటి నుంచి పాతవిధానంలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు.. స్లాట్ల బుకింగ్‌కు అవకాశం కల్పించారు.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు
ఈ నెల 14 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 95 రోజుల తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు.