సాటి మనిషి గురించి పట్టించుకోవడానికే తీరిక లేని రోజుల్లో... తన జీవితాన్ని పరుల సేవకు అంకితం చేశాడు నగరానికి చెందిన గౌతమ్. రెండేళ్లలో 5 వందల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి ఎందరికో మరణానంతర మజిలీ అయ్యాడు. సర్వ్ ది నీడి అనే సంస్థ ద్వారా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను యువ సేవారత్న పురస్కారంతో సత్కరించింది. గౌతమ్ ఇప్పటికే గిన్నిస్ బుక్, యూనివర్సల్ బుక్, వండర్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించటమే కాకుండా పిల్లల, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందడమే కాక... మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఆదర్శ సేవకు యువ సేవారత్న పురస్కారం - gpwtham
బతికుండగా ఎవ్వరూ లేక అనాథల్లా బతికీడ్చి తనువు చాలించిన వారికి అతడు మరణానంతరం ఆప్తుడయ్యాడు. రెండేళ్లలో ఐదొందల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన గౌతమ్‌ను సేవారత్న పురస్కారం వరించింది.
ఆదర్శ సేవకు యువ సేవారత్న పురస్కారం