తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్లిప్​కార్ట్​తో సెర్ప్ ఒప్పందం.. ఇకపై ఆన్​లైన్​లో ఆ వస్తువులు

ప్రముఖ ఆన్​లైన్​ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో సెర్ప్​ సీఈవో, ఫ్లిప్​కార్ట్​ ఉపాధ్యక్షురాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఫ్లిప్​కార్ట్​తో సెర్ప్ ఒప్పందం.. ఇకపై ఆన్​లైన్​లో ఆ వస్తువులు
ఫ్లిప్​కార్ట్​తో సెర్ప్ ఒప్పందం.. ఇకపై ఆన్​లైన్​లో ఆ వస్తువులు

By

Published : Jun 25, 2022, 4:10 PM IST

స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఫ్లిప్​కార్ట్ సంస్థ ద్వారా ఆన్​లైన్​లో విక్రయించనున్నారు. ఈ మేరకు ఫ్లిప్​కార్ట్​తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్లిప్​కార్ట్ సంస్థ ఉపాధ్యక్షురాలు స్మృతి రవిచంద్రన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

రాష్ట్రంలో సెర్ప్ ఆధ్వర్యంలోని ఎస్​హెచ్​జీలు తయారు చేసే వివిధ ఉత్పత్తులను ఫ్లిప్​కార్ట్ ద్వారా ఆన్​లైన్​లో విక్రయించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎఫ్​పీవోలు సేకరించే ధాన్యం సహా వివిధ వ్యవసాయ ఉత్పత్తులకూ అవకాశం కలుగుతుంది. తద్వారా ఫ్లిప్​కార్ట్​కు​ మార్కెటింగ్ పెరగడంతో పాటు వ్యాపార వృద్ధి జరిగి.. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు.. తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

మహిళా సంఘాలకు మంచి వేదిక.. ఈ సందర్భంగా రూ.కోట్ల వ్యాపారం జరిగే ఫ్లిప్​కార్ట్ మహిళా సంఘాలకు మంచి వేదిక అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడంతో పాటు నాణ్యమైన వస్తువులు లభిస్తాయని తెలిపారు. రూ.500 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. మన దగ్గర ‌పండించే పంటలు, తయారు చేసే వస్తువులను అమ్మాలని సూచించిన ఎర్రబెల్లి.. గ్రామాల్లో పండే అన్ని పంటలను కొనాలని ఎఫ్​పీవోలకు సూచించారు. దేశంలోనే మొదటిసారిగా మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఫ్లిప్​కార్ట్ సంస్థ ఉపాధ్యక్షురాలు స్మృతి రవిచంద్రన్.. తెలంగాణ రైతులు‌ పండించిన పంటలు భారతదేశ ప్రజలకు అందించబోతున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details