తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐటీలో వచ్చే ఐదేళ్లలో బెంగళూరును దాటేస్తాం..!' - 34 శాతం

తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ, ఫార్మ, సాఫ్ట్​వేర్ ఎగుమతులు ఏటికేడు పెరుగుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ సీఈవో అజెయ్ సహాయ తెలిపారు.

తెలంగాణ నుంచి పెరుగుతున్న ఐటీ ఎగుమతులు

By

Published : Jul 25, 2019, 3:16 PM IST

Updated : Jul 26, 2019, 6:18 AM IST

తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటీ, సాఫ్ట్​వేర్ ఎగుమతులు ఏటికేడు పెరుగుతున్నాయని, వచ్చే ఐదేళ్లలో ఈ వాటా బెంగళూరును అధిగమిస్తుందని భారతీయ ఎగుమతుల కంపెనీల సమాఖ్య అభిప్రాయపడింది. బిజినెస్ కాంక్లేవ్ సెమినార్ ఆన్ ఎక్స్​పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ​పలువురు ఐటీ నిపుణులు పాల్గొన్నారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ వేగంగా రాణిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ సీఈవో అజెయ్ సహాయ తెలిపారు.

భారతీయ వస్తువుల ఎగుమతులకు అమెరికా కన్నా చైనాలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతుల వాటాను పెంచుకునేందుకు బ్రాండెడ్ వస్తువులు దోహదం చేస్తాయన్నారు. దేశీయ ఉత్పత్తులను బ్రాండ్ల పేర్లతో ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. బడ్జెట్​లో సన్​రైస్ ఎంటర్ ప్రైజెస్​కు రాయితీలు ప్రకటించి పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రం మార్గం సుగుమం చేసిందని వివరించారు.

తెలంగాణ నుంచి పెరుగుతున్న ఐటీ ఎగుమతులు

ఇదీ చూడండి : శంషాబాద్​ విమానాశ్రయంలో విదేశీ సామాగ్రి సీజ్​

Last Updated : Jul 26, 2019, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details