Security in Telangana Assembly Election Polling 2023 : పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్‌ను(Telangana Assembly Elections) విధించారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30 ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడవద్దని హెచ్చరించారు.
మద్యం, కల్లు దుకాణాలు, బార్లు 48 గంటలపాటు మూసివేయాలని.. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోసం విధుల్లో భారీగా సిబ్బందిని మోహరించారు . 45,000 ల రాష్ట్ర పోలీసులు.. 3000 ఇతర శాఖలకు చెందిన రక్షకభటులు, 50 కంపెనీల ప్రత్యేక పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. వీళ్లకు అదనంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి 23,000ల హోంగార్డులు సైతం ఎన్నికల్లో సేవలందించనున్నారు .
ఇట్స్ ఓటర్ టైం - శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం
Police Security Arrangements Ready for Polls : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో.. అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర సాయుధ బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పహారా ఉంచనున్నారు. కెమెరా మౌంటెడ్ వాహనాలను మోహరించనున్నారు . గస్తీ వాహనాలు సైతం పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చక్కర్లు కొట్టనున్నాయి.పోలింగ్ కేంద్రాల(Polling Centers in Telangana) వద్ద ఏదైనా సమస్య తలెత్తినట్లు తెలియగానే నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా సత్వర స్పందన బృందాలను ఏర్పాటు చేశారు.
ఓటు హక్కే కాదు! బాధ్యత కూడా- గతంలో కంటే మెరుగైన పోలింగ్ శాతం వచ్చేందుకు ప్రయత్నాలు