సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ రాయల్స్‌లో క్లబ్ గవర్నర్ దుర్గావాణి సురభి.. ఉపాధ్యాయులను సత్కరించారు. దేశానికి ఉపయోగపడే భారత పౌరులను తీర్చిదిద్దే గురువులను సత్కరించుకోవడం మన సంస్కృతిలో భాగమని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో గౌరవమైనదని, ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే అన్ని రంగంలో నిష్ణాతులను తయారు చేయగలరని తెలిపారు.
'భావిపౌరులను తీర్చిదిద్దే గురువులను సత్కరించడం మన సంస్కృతి' - Secundrabad lions club
దేశానికి ఉపయోగపడే భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురువులను సత్కరించుకోవడం మన సంస్కృతిలో భాగమని హైదరాబాద్ లయన్స్ క్లబ్ గవర్నర్ దుర్గావాణి సురభి అన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని లయన్స్ క్లబ్ రాయల్స్‌లో ఉపాధ్యాయులను సత్కరించారు.
సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని లయన్స్ క్లబ్ రాయల్స్
ఉపాధ్యాయులు తమ వృత్తిలో మరింత రాణించేలా.. లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో కొన్ని దశాబ్ధాల నుంచి వారికి శిక్షణ అందిస్తున్నామని సురభి అన్నారు. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులేనని, పిల్లలు సన్మార్గంలో నడిచేలా వారికి నైతిక విలువలు నేర్పించే బాధ్యత గురువులతో పాటు తల్లిదండ్రులకూ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా ఛైర్మమన్ ఆకుల రవీందర్ రావు, ప్రమోద్ గోపిశెట్టి, కిశోర్ ఛాబ్రియా పాల్గొన్నారు.