సికింద్రాబాద్ జోన్‌లో 11 గంటల వరకు 12 శాతం పోలింగ్ నమోదైందని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లు... 27 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
సికింద్రాబాద్ జోన్‌లో ప్రశాంతంగా పోలింగ్: జోనల్ కమిషనర్ - జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ 2020
బల్దియా పోలింగ్ సికింద్రాబాద్ జోన్‌లో ప్రశాంతంగా కొనసాగుతోందని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సికింద్రాబాద్ జోన్‌లో 11 గంటల వరకు 12 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు.
సికింద్రాబాద్ జోన్‌లో ప్రశాంతంగా పోలింగ్: జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
ఓటర్ల జాబితాలో పేరు లేని వారు తమ దృష్టికి తీసుకురావాలని చెప్పామని... ప్రజలకు చాలా అవకాశాలు ఇచ్చామని తెలిపారు. బ్యాలెట్ ఓటుపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నల్లకుంట నుంచి పోలింగ్ సరళిపై సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ఇదీ చదవండి:ఓటింగ్లో ముందున్న పోలీస్బాస్లు