తెలంగాణ

telangana

ETV Bharat / state

ముషీరాబాద్​లో తెరాస ఎన్నికల ప్రచారం - ఎన్నికల ప్రచారం

నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని  ప్రారంభించారు. ముషీరాబాద్​లో సికింద్రాబాద్​ తెరాస అభ్యర్థి సాయికిరణ్​​ యాదవ్​ ప్రచారం ప్రారంభించారు. తెరాస నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు వెంట రాగా.. పలు ప్రాంతాల్లో పర్యటించారు.

తెరాస ప్రచారం

By

Published : Mar 26, 2019, 12:59 PM IST

Updated : Mar 26, 2019, 3:04 PM IST

ప్రచారం నిర్వహిస్తున్న తెరాస నాయకులు
ముషీరాబాద్​లో తెరాస అభ్యర్థి సాయికిరణ్​​ యాదవ్​ లోక్​సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్​ కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్థానిక హనుమాన్​ దేవాలయం నుంచి కొత్త బజార్​ వరకు తెరాస శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.

కేంద్రంలో చక్రం తిప్పుతాం

లోక్​సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో కేసీఆర్​ చక్రం తిప్పుతారని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు దోహదపడతాయని సికింద్రాబాద్​ తెరాస అభ్యర్థి సాయికిరణ్​​ యాదవ్​ అన్నారు. నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు.

ఇదీ చూడండి :90 దాటితే... బ్యాలెట్​ పేపర్లతోనే ఎన్నికలు!

Last Updated : Mar 26, 2019, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details