తెలంగాణ

telangana

ETV Bharat / state

Secunderabad-Raipur Express: సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 రోజులు రద్దు - సికింద్రాబాద్‌ రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 రోజులు రద్దు

Secunderabad-Raipur Express cancelled: సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Secunderabad-Raipur Express
Secunderabad-Raipur Express

By

Published : Aug 8, 2022, 9:45 AM IST

Secunderabad-Raipur Express cancelled: సికింద్రాబాద్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ మూడు రోజుల పాటు రద్దయ్యింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి వేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ (12771) ఎక్స్‌ప్రెస్‌ 8, 10, 12వ తేదీల్లో, రాయ్‌పుర్‌-సికింద్రాబాద్‌ (12772) ఎక్స్‌ప్రెస్‌ 9, 11, 14వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండదు.

మరోవైపు త్రివేండ్రం-సికింద్రాబాద్‌ (17229) ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ వేళలను రైల్వేశాఖ మార్చింది. త్రివేండ్రం నుంచి ఉదయం 6.45 గంటలకు బదులుగా.. 10.15 గంటలకు ఈ రైలు బయల్దేరుతుంది. ఈ నిర్ణయం ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 7 వరకు (ఆదివారాలు మినహా) అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details