కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనే ఆశతో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 45 వేల నగదు, ఒక టీవీ, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌పై వీరు బెట్టింగ్ నిర్వహించారు. హైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లోని మహారాజ్ గంజ్‌లో స్థిరపడిన నత్వార్థరక్, సిద్ధ రమేష్ మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్‌లో ప్రపంచకప్ సెమీఫైనల్‌పై బెట్టింగ్ - సికింద్రాబాద్
ప్రపంచకప్ క్రికెట్‌పై బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. గురువారం నాడు జరిగిన ఆస్ట్రెలియా, ఇంగ్లాండ్ మ్యాచ్‌పై సికింద్రాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ నిర్వహించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 45 వేల నగదు, ఒక టీవీ, 4 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రపంచకప్ సెమీఫైనల్‌పై బెట్టింగ్